మరొకరు వైసిపి టూ టిడిపి

SMTV Desk 2017-11-03 18:42:33  ycp, tdp, gandam venkanna, east godavari,

తూర్పు గోదావరి, నవంబర్ 3 : వరుసగా వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఈ తరుణంలో తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధిలోని చొప్పెల్ల గ్రామంలో నిర్వహించిన ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వైఎస్సార్ సిపి పార్టీకి చెందిన గంధం వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్బంగా ఆయనకు యువ నాయకుడు బండారు సంజీవ్, మెర్ల గోపాలం, ఆకుల రామకృష్ణ, కొత్తూరు వీరన్న నాయుడు, తదితరులు స్వాగతం పలికారు.