ఇంటి ఇంటికి తెలుగుదేశంలో బండారు

SMTV Desk 2017-11-03 18:36:34  former bandaru sathyananda rao, inti intiki telugudesham, east godavari,

తూర్పు గోదావరి, నవంబర్ 3 : తూర్పు గోదావరి జిల్లాలో, కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధిలోని చొప్పెల్ల గ్రామంలో ఇంటి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఆయనకు, గ్రామ సర్పంచ్ మెర్ల సత్యవతి, గోపాలం కొత్తపేట గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో బండారు సత్యానందరావు గ్రామంలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దండంగి మమత, ఎంపిపి కొత్తపల్లి ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్ల బాబు, సయ్యపరాజు జనార్దనరాజు, సిద్ధి రెడ్డి పెద్దకాపుమ్, ఆకుల రామకృష్ణ, రాయుడు సూర్యనారాయణ, మైగాపుల గుర్రయ్యనాయుడు, అధికసంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.