నా బౌలింగ్ టెక్నిక్ గురించి చర్చించాను : అక్షర్ పటేల్

SMTV Desk 2017-11-03 18:30:36  LEFT ARM SPINNER AKSHAR PATEL, ABOUT BOWLING, INDIAN CRICKTE COACH , RAVI SHASTRI, RAJ KOT

రాజ్ కోట్, నవంబర్ 03 : టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ తన బౌలింగ్ టెక్నిక్ గురించి భారత క్రికెట్ ప్రధాన కోచ్ రవిశాస్తితో చర్చించనని స్పష్టం చేశారు. అదే విధంగా రవిశాస్త్రి కూడా తనకు పెద్దగా సలహాలు ఇవ్వరంటూ వ్యాఖ్యానించాడు. "నా బౌలింగ్ ఇలా ఉండాలని రవిశాస్త్రి ఎక్కువగా నాకు చెప్పరు. కాకపోతే ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్ చేయాలనే దానిపై మాత్రం మేము ఎక్కువగా మాట్లాడుకుంటాం. అయిన నాకిచ్చే సలహా ఏదైనా ఉందంటే వికెట్లకు గురి తప్పకుండా బౌలింగ్ చేయమనే సలహా మాత్రమే" అని అక్షర్ తెలిపాడు.