అమ్మకానికి ఎన్టీఆర్ ఇల్లు..

SMTV Desk 2017-11-03 18:18:22  NTR house sale, T Nagar, NTR family, sale board.

చెన్నై, నవంబర్ 03 : చెన్నైలోని అన్న ఎన్టీరామారావు ఇ౦టికి సేల్ బోర్డు వేలాడుతుంది. టీ నగర్ లోని 28 బజుల్లా రోడ్ లో ఉన్న ఆయన ఇంటి గేటుకు బ్రోకర్ ఏలుమలై పేరిట అమ్మకపు బోర్డ్ వేలాడుతుంది. ఎంతో ఇష్టపడి కొనుకున్న ఈ ఇంటితో రామారావుకు, అతని అభిమానులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. దీనిని ఆయన 1953 లో శివరావు దగ్గర నుండి కొనుగోలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబం హైదరాబాద్ నగరానికి మారిపోయాక ఆ ఇల్లు కళ తప్పిందని.. ఇప్పుడు ఈ ఇల్లు అమ్మకానికి పెట్టారన్న వార్త అభిమానులను కుంగదీస్తుంది. ఈ చారిత్రాత్మక ఇంటిని రామారావు వారసులు ఎవరైనా కొంటే బాగుంటుందని అన్న అభిమానులు కోరుకుంటున్నారు.