అసెంబ్లీలో నిరసనగా విపక్షాల వాకౌట్‌

SMTV Desk 2017-11-03 15:49:47  Assembly, hyderabad, Legislative leader Kishan Reddy, The walkout of the opposition

హైదరాబాద్‌, నవంబర్ 03 : రాష్ట్రంలో 15శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నా తమ కష్టాలు చెప్పుకొనేందుకు ఓ కమిషన్‌ లేకపోవడం బాధాకరమని భాజపా శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి అన్నారు. మతపరమైన బిల్లును సభలో పెట్టారు తప్ప ఉన్న చట్టాల ప్రకారం మూడేళ్లుగా కమిషన్‌ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా కమిషన్‌ ఏర్పాటు పూర్తిగా చేయలేదన్నారు. ఆ వర్గాలను నిర్లక్ష్యం చేసినందుకు నిరసనగా సభనుంచి వాకౌట్‌ చేశారు. కాగా, ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డితో పాటు తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఈ అంశంపై అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడినట్లు సమాచారం.