ట్రంప్ ట్విట్టర్ ఖాతా మాయం..!

SMTV Desk 2017-11-03 12:02:40  TRUMP TWITTER ACCOUNT, DONALD TRUMP, AMERICA,

వాషింగ్టన్, నవంబర్ 3: ఓ ట్విట్టర్ ఉద్యోగి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను తొలగించేశాడు. ఈ సంఘటనతో ఒక్కసారిగా సాయంత్రం 4 గంటల సమయంలో 11 నిమిషాలు పాటు ట్రంప్ పేజ్ లేనట్లు చూపించిదట. దీంతో ఆ కంపెనీ.. ఆ ఉద్యోగి పొరపాటున ట్రంప్ ఖాతాను డియాక్టివేట్ చేశాడు కాని అతను కావాలని చేయలేదని పేర్కొంది. వెంటనే అప్రమత్తమై కొద్ది సెకన్లలోనే యాక్టివేట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇటువంటి తప్పులు మున్ముందు జరగకుండా జాగ్రత్తలు వహిస్తామని ట్విట్టర్ అధికారులు తెలిపారు. ట్రంప్ 2012లో ట్విట్టర్ ఖాతాను తెరువగా ఇప్పటికి ఆయన ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లు దాటింది.