గడువు కంటే ముందే నైరుతి రుతుపవనాలు

SMTV Desk 2017-05-28 16:03:44  mansoons,rains,kerala,thamilnadu,karnataka

చెన్నై, మే 26 : నైరుతి రుతుపవనాలు గడువు కంటే ముందే రాష్ట్రాన్ని తాకనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, క్యూములోనింబస్ మేఘాల మూలంగా ఈనెల 30 లోపే నైరుతి రుతుపవనాలు కేరళను స్పృశిస్తాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. అల్పపీడనం మూలంగా నైరుతి రుతుపవనాల గమనం సాఫీగా ముందుకు సాగుతున్నది. రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా సముద్రం అలల్లో ప్రశాంతత, నిశ్శబ్దం నెలకొంటున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళలల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు.