పవన్ కొడుకు పేరు విన్నారా..

SMTV Desk 2017-11-02 15:53:48  Pavan kalyan son name, Pavan kalyan, Anna Lezhneva.

హైదరాబాద్, నవంబర్ 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య లెజినోవా ఇటీవల ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడా బాబుకు నామకరణం చేశారు. ఇంతకి ఏం పేరు పెట్టారా అని ఆలోచిస్తున్నారా..! పవన్ ఆ బుడతడికి "మార్క్ శంకర్ పవనోవిచ్" అని పేరు పెట్టారు. ఈ పేరు వినగానే పవన్ అభిమానులందరూ కొంత ఆశ్చర్యపోతున్నారు. ఈ పేరు వెనుక చిన్నపాటి కథే ఉందండోయ్. అదేంటంటే.. పవన్ భార్య లెజినోవా రష్యన్ ఆర్థోడక్స్ మత సంప్రదాయాలను పాటిస్తుందట. క్రైస్తవ మతంలో ‘మార్కస్’ దేవుడికి సంక్షిప్త రూపంగా తన బిడ్డకు మొదటగా మార్క్ అని, తన అన్నయ్య పేరులోని ‘శంకర్’ ను, తన పేరు పవన్ ను కలిపి ‘పవనోవిచ్’ గా మార్చి "మార్క్ శంకర్ పవనోవిచ్" గా నామకరణం చేశారట. అంతేకాదు పవన్, లెజినోవాల కుమార్తె అయిన పోలేనా పేరును కూడా మార్చి ‘పోలేనా అంజనా పవనోవా‘ అని పెట్టారు. ఇప్పుడు ఈ పేర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.