ఉత్తర కొరియాతో మా బంధం శాశ్వతం : చైనా

SMTV Desk 2017-11-02 15:40:24  China president Jinping, north koria president kim jaang un, North koriya letter to chaina.

సియోల్, నవంబర్ 02 : చైనా కమ్యూనిస్ట్ నేతగా, అధ్యక్షుడిగా జిన్ పింగ్ రెండవసారి ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా ఉత్తర కొరియా నియంత, అమెరికాతో అణు యుద్ధానికి కాలు దువ్వుతున్న వికృత నేత, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, తమ ద్వైపాక్షిక బంధాన్ని వివరిస్తూ ఒక లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన జిన్ పింగ్, కిమ్ లేఖ తన మనసుని తాకిందని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాతో గతంలో మాదిరిగానే భవిష్యత్తులో కూడా ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి, సహకారం, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ఉత్తర కొరియా, చైనాకు అత్యంత నమ్మకమైన మిత్ర దేశంగా జిన్ పింగ్ అభివర్ణించారు.