అసెంబ్లీలో చర్చలు షురు..

SMTV Desk 2017-11-02 12:22:11  assembly, harishrao, MLA Rasamai balakishan, Midmanera project

హైదరాబాద్‌, నవంబర్ 02 : సభ ప్రారంభం కావడంతోనే మిడ్‌మానేరు ప్రాజెక్టుపై చర్చ జరిగింది. మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయని కరీంనగర్ జిల్లా మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మిడ్‌మానేరు ప్రాజెక్టు పనుల కొరకు రూ. 461 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. పనులపై రూ.639 కోట్లు ఖర్చుపెట్టగా.. పునరావాసానికి రూ.1771 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 466 గ్రామాలకు డిసెంబర్‌ నుంచి తాగునీరు ఇస్తామని హరీశ్‌రావు వెల్లడించారు.