మహేంద్ర బాహూబలి...ధనాధన్ ధోని

SMTV Desk 2017-06-09 12:13:26   Champions Trophy, Team India, Sri lanka, Virender Sehwag, MS Dhoni

లండన్, జూన్ 09 : ఛాంపియన్స్ ట్రోపిలో బాదిన బాదుడుకు మహేంద్ర సింగ్ ధోనిని మహేంద్ర బాహూబలి అంటూ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. లండన్ ఓవల్ మైదానం లో భారత్ శ్రీలంక జట్ల మధ్య గురువారం జరిగిన మ్యా్చ్ లో ఎంఎస్ ధోని అద్భుతమైన బ్యాంటింగ్ ప్రదర్శన చేసినప్పటికి భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని 7 బౌండరీలు, రెండు సిక్స్ లతో 52 బంతుల్లో 63 పరుగులతో చెలరేగాడు. ఆటను కామెంటరీ బాక్స్ లో ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ మెచ్చుకుంటు ధోని ధనాధన్ ఇన్సింగ్స్ కు ముగ్దుడయ్యాడు. ధోని అర్ధ శతకం పూర్తిచేసిన తరువాత ఆయన బలాన్ని..ఆట తీరును ప్రశంసిస్తు మహేంద్ర సింగ్ ధోని ...మహేంద్ర బాహూబలి అంటూ ట్విట్టర్ కామెంట్ చేశారు. కామెంట్ కు వెలాదిగా క్రీడాభిమానులు స్పందించారు. ఇక నుంచి అందరూ మహేంద్ర బాహూబలి అని పిలువాలని కొందరు, వందల కోట్ల క్రికెట్ క్రిడాభిమానుల హృదయాలను దోచుకున్న మహేంద్ర బాహూబలి అంటూ ప్రశంసల వర్షం కురి పించారు. తెలుగు సినిమా బాహూబలి ఎంతగా జనాలను ఆకర్షించిందో ధోని కి అందిన ప్రశంసల వర్షం ద్వారా వెల్లడవుతున్నది. మరో మారు బాహూబలి చిత్రం పేరు కోట్ల క్రికెట్ క్రిడాభిమానుల నోట్లలో నాను తున్నదని తెలుగు వారు గర్వపడాల్సిందే.