దేశంలోని సులభ వాణిజ్య నగరాలలో హైదరాబాద్ కు రెండవ స్థానం

SMTV Desk 2017-11-01 19:11:52  Ease of business 17 cities in india, hyderabad 2nd place

హైదరాబాద్, నవంబర్ 01 : దేశంలోని 17 ప్రధాన నగరాలకు వాణిజ్య నిర్వహణ అంశంపై ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ర్యాంకులలో హైదరాబాద్ నగరం రెండవ స్థానం పొందింది. లూథియానా మొదటి స్థానంలో నిలిచింది. వ్యాపారాలు ప్రారంభించటం, భవన నిర్మాణాలకు అనుమతి పొందటం, రుణాల మంజూరీ, చిన్న పెట్టుబడి దారుల రక్షణ, పన్ను చెల్లింపులు తదితర సంస్కరణల అమలు విషయమై ప్రపంచ బ్యాంకు వివరాలు సేకరించి ఈ ర్యాంకులు రూపొందించింది. ఈ 17 స్థానాలు వరుసగా లూధియానా, హైదరాబాద్, భువనేశ్వర్ తదితరాలు ఉన్నాయి. విదేశాలలో విద్యానభ్యసించిన కేటీఆర్ పలు విదేశాలను సందర్శించి, పారిశ్రామికవేత్తలను కలవటం, రాష్ట్ర విధానాలను వివరించటం, తగిన విధంగా ఆచరణలో కూడా అనువైన పరిస్థితులు కల్పించటం, ప్రతి విషయంలో పెట్టుబడి దారులకు అండదండలు అందించటం మూలంగా వాతావరణం ఈ ర్యాంకు సాధనకు తోడ్పడింది. ఇప్పటికే కొంతమంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వందల కోట్ల రూపాయలతో పలు సంస్థల స్థాపనకు ఆసక్తి చూపిస్తున్నారు. పాఠకులకు గమనిక : (సమాచార సేకరణలో కొన్ని పొరపాట్లు జరిగినందు వలన ఈ వార్తను పరిగణలోకి తీసుకోనవలదని మనవి. అసౌకర్యానికి చింతిస్తున్నాము.)