ఆడకముందే పతకం సాధించిన సీమా పునియా..

SMTV Desk 2017-11-01 18:55:08  Asian Championship, host Vietnam, boxing category, Seema Punia

వియాత్నం, నవంబర్ 01 : ఆసియా ఛాంపియన్ షిప్ లో భారత్ కు బాక్సింగ్ 81 కిలోల విభాగంలో పతకం ఖాయమైంది. ఆడక ముందే పతకం ఏంటి అనుకుంటున్నారా.! హర్యానాకి చెందిన మహిళా బాక్సర్ సీమా పునియా పోటి పడుతున్న బాక్సింగ్ విభాగంలో కేవలం నలుగురు మాత్రమే పాల్గొనడంతో డ్రా తీయగా బై రావడంతో నేరుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈమె నవంబర్ 7వ తేదీన ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ గుజల్‌ ఇస్మతోవాతో పోటీపడనుంది. ఇందులో ఓడిన పతకం ఇస్తారు. రేపు ఒలింపిక్‌ కాంస్య పతక విజేత, ప్రముఖ మహిళా బాక్సర్ మేరీకొమ్ 48 కీలోల విభాగంలో స్థానిక బాక్సర్‌ డీమ్‌ థి ట్రించ్‌ కియూతో తలపడనుంది.