‘జై సింహ’ ఫస్ట్ లుక్ విడుదల...

SMTV Desk 2017-11-01 18:50:50  JAI SIMHA FIRST LOOK, BALAKRISHNA, NAYANTARA, K S RAVIKUMAR

హైదరాబాద్, నవంబర్ 1 : బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 102 వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు కథానాయకుడిగా ‘జై సింహ’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రంలో బాలయ్య బాబు చేతిలో కర్ర పట్టుకొని కుర్రాడిలా అదరగోట్టేసాడు. అంతే కాదు పోస్టర్లో బాలయ్య తండ్రి, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు విగ్రహం, పక్కన ధర్నా చేస్తున్న ప్రజలను చూస్తుంటే దేనికోసమో పోరాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయన తార, హారి ప్రియ, నటాషా దోషి, కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసుకొని, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే౦దుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.