ఏపీ రాజధానిలో సైకిల్ సవారీ

SMTV Desk 2017-11-01 16:30:05  AP Secretariat Bicycle ride, CRDA, AMARAVATHI,

అమరావతి, అక్టోబర్ 01 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పర్యావరణ హితంగా మార్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారక సంస్థ(సీఆర్డీఏ) సచివాలయంలో సైకిల్ సవారీకి ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం జర్మనీ నుండి ప్రత్యేకంగా 30 అత్యాధునిక సైకిళ్ళను దిగుమతి చేసింది. ఆల్ ఇండియా బైక్ ఫెడరేషన్, ఆంధ్రాబ్యాంక్, నెక్స్ట్ బైక్ సంస్థల సౌలభ్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జర్మనీ సహా అనేక దేశాలలో ప్రారంభించింది. ఈ సైకిల్ సవారీని మరో పది రోజుల్లో వినియోగంలోకి తేనున్నారు. ఒక్కో సైకిల్ ధర సుమారు రూ. లక్ష ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ సైకిళ్ళ వినియోగాన్ని ప్రోత్సహించడానికి అమరావతి రహదారుల వెంబడి 1,670 కి.మీ.ల పొడవైన ప్రత్యేక సైకిల్ మార్గాలను సీఆర్డీఏ అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఇంకా ప్రతి కిలోమిటర్ కు ఒకటి చొప్పున సైకిల్ స్టాండ్ లను ఏర్పాటు చేయనున్నారు.