శ్రీలంక చేతిలో భారత్ కు...

SMTV Desk 2017-06-09 11:44:37  champions trophy, srilanka, india, won srilanka

లండన్, జూన్ 09 : గెలుపు ధీమాతో ఉన్న టీమిండియా పై నీళ్లు జల్లినట్లయింది. శ్రీలంక చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. కూనలతో విజయం సులభమని భావించిన టీమిండి యా చుక్కలు చూడాల్సి వచ్చింది. అద్భుతమైన శ్రీలంక బ్యాటింగ్ తీరు ప్రదర్శన క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకర్షించింది. ఛాంపియన్స్ ట్రోపి లో సౌతాఫ్రికాతో పరాభవం చవిచూసిన శ్రీలంక భారత్ ను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకుంది. ఛాంపియన్స్ ట్రోపిలో భాగంగా ఓవల్ మైదానంలో జరిగిన గ్రూప్- బి లీగ్ మ్యాచ్ లో శ్రీలంక 7 వికేట్ల తేడాతో భారత పై విజయం సాధించింది. దానికి తోడు ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలోఅత్య ధిక పరుగులు 322 తో విజయం సాధించి రికార్డు నెలకోల్పింది. క్రికెట్ లో సాధ్యాసాధ్యాలు అనేవి ఎప్పుడైనా జరుగవచ్చని శ్రీలంక నిరూపించింది. బలహీనంగా కన్పించిన జట్టు అతి విశ్వాసం పై సునాయసంగా విజయం సాధించినట్లయింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. శిఖర్ ధావన్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి 128 బంతుల్లో 125 పరుగులు సాధించారు. 15 బౌండరీలు, 2 సిక్సర్లతో ఆటతీరు కనువిందు చేశాడు. రోహిత శర్మ 6 బౌండరీలు, 3 సిక్సర్లతో 79 బంతుల్లో 78 పరుగులు సాధించగా, ధోని 7 బౌండరీలు, రెండు సిక్స్ లతో 52 బంతుల్లో 63 పరుగులతో చెలరేగాడు. శ్రీలంక 48.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 322 పరుగులు సాధించింది. 93 బంతుల్లో 89 పరుగులను 11 బౌండరీలు, ఒక సిక్స్ తో విజయాన్ని అందించిన కుషాల్ మెండీస్ కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కగా ధనుష్క గుణతిలక, కెప్టెన్ మ్యాథ్యూస్, కుషాల్ పెరీరా కూడా శ్రీలంక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ధనుష్క గుణతిలక 72 బంతుల్లో 76 పరుగులు సాధించగా, కెప్టెన్ మ్యాథ్యూస్ 45 బంతుల్లో 52 పరుగులు, కుషాల్ పెరీరా 44 బంతుల్లో 47 పరుగులు సాధించినప్పటికి రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరి గారు. గాయాలవడం కాని అస్వస్థతకు గురవడం ద్వారా మధ్యలోనే ఆటను నిలిపేసుకోవడాన్ని రిటైర్డ్ హార్ట్ గా పరిగణిస్తారు. గ్రూప్ - బి లో ఉన్న భారత్, పాక్, శ్రీలంక, దక్షిణాఫ్రికా లు ఒక్కో విజయంతో రెండేసి పాయింట్ల చొప్పున సాధించి అందరూ సమంగా ఉన్నారు. తర్వాత జరుగనున్న మ్యాచ్ లలో రెండో విజయం నమోదు చేసిన జట్టుకు సెమీస్ లో చోటు దక్కుతుంది.భారత్ దక్షిణాఫ్రికాతో, శ్రీలంక పాకిస్థాన్ తో తలపడి గెలిచిన జట్లు సెమీస్ కు చేరనున్నాయి