ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా రఘురాం..!

SMTV Desk 2017-11-01 12:35:20  India former RBI Governor, become amerika central bank reserve chairman, donald trump.

న్యూఢిల్లీ, అక్టోబర్ 01 : భారత ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఒక కొత్త పదవి చేపట్టనున్నట్లు సమాచారం. అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా రాజన్ అన్ని విధాల సరైన వ్యక్తి అని అంతర్జాతీయ ఆర్ధిక విషయాల పత్రిక "బారన్స్" అభిప్రాయపడింది. ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ గా ఉన్న జానెట్ ఎలెన్ రిటైర్ అవనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కొత్త చైర్మన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. కాగా ట్రంప్ ఇప్పటికే కొందరు వ్యక్తుల పేర్లను ఒక జాబితాగా రూపొందించింది. ఆ జాబితాలో రఘురాం పేరు లేకపోయినా ఆ బార్సన్ పత్రిక ఇలా వెల్లడించడం గమనార్హం.