స్మార్ట్ ఫోన్ లాగే స్మార్ట్ ట్రైన్....

SMTV Desk 2017-11-01 12:20:23  Smart Train, china, roads,

చైనా, నవంబర్ 01 : ప్రపంచంలో వివిధ కొత్త రకాల టెక్నాలజీలు ఏర్పడుతున్న తరుణంలో తొలిసారిగా స్మార్ట్ ఫోన్ లాగే స్మార్ట్ ట్రైన్ మరో త్వరలో చైనా రోడ్లపై పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం హునాన్‌ రాష్ట్రంలోని జుజోయ్‌ నగరంలో ప్రయోగాత్మకంగా నడుపుతున్న ఈ ట్రైన్ ను ఈ ఏడాది జూన్‌లో దీన్ని ఆవిష్కరించారు. మూడు బోగీలు ఉండే ఈ రైల్లో ఒకేసారి 300 మంది ప్రయాణించొచ్చు. గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. కేవలం పది నిమిషాల ఛార్జింగ్‌తో 25 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. రోడ్లపై గీసిన తెల్లటి చారలపై ఈ రైలు నడుస్తుంది. అంతేకాదు అర్బన్‌ ట్రైన్‌ లేదా ట్రామ్‌లు నడవాలంటే ట్రాక్‌లు తప్పనిసరి. దీనికి వాటితో పనిలేదు. అందుకే దీని ఏర్పాటుకు ఖర్చు కూడా తక్కువే అవుతోంది. ప్రస్తుతానికి నాలుగు స్టేషన్లను కలుపుతూ 3.1 కిలోమీటర్ల దూరం మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తోంది. వచ్చే ఏడాది ఈ ట్రైన్ పరుగులు తీయనున్నట్లు సమాచారం.