అసెంబ్లీలో.. మంత్రి హరీశ్‌రావు...

SMTV Desk 2017-10-31 18:27:47  Assembly Affairs Minister Harish Rao, kcr, hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 31 : ప్రాజెక్టులపై రీఇంజనీరింగ్ ఎందుకు అనే వారికి కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రోలజీ క్లియరెన్స్ ఇవ్వడం చెంప పెట్టు లాంటిదని సోమవారం మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏడాదిపాటు ఇంజినీర్లు, మేధావులతో చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టుకు స్వయంగా కేసీఆర్‌ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీరిస్తామని వెల్లడించారు. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ మధ్య 109 కి.మీ దూరం ఉంటుందని.. ఈ పరిధిలో గోదావరి 365 రోజులు నిండుకుండలా ఉంటుందన్నారు. మేడిగడ్డ వద్ద 285 టీఎంసీల నీటిలభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ నిన్న చెప్పిందన్నారు. గోదావరి బేసిన్ లో చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించి సభ్యులు బుట్ట మధు, సోమవరపు సత్యనారాయణ, దివాకర్ రావు శాసన సభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గోదావరిపై వరుస ప్రాజెక్టుల వల్ల సాగునీటి పారుదల, పర్యాటక, పారిశ్రామిక ప్రాంతం జలరవాణా అభివృద్ధి చెందుతాయని హరీశ్‌రావు వెల్లడించారు.