వైట్‌హౌస్‌లో ఘన౦గా "హాలోవీన్"

SMTV Desk 2017-10-31 17:47:01  Amerika white house, Halloween celebrations, donald trump.

వాషింగ్టన్, అక్టోబర్ 31 : అమెరికాలోని వైట్‌హౌస్‌లో హాలోవీన్ ఉత్సవాలను ఘన౦గా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తానూ అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి హాలోవీన్ పండగ కావడంతో చాలా ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చిన్నలు, పెద్దలు కలిపి దాదాపు 6000 మంది హాజరయ్యారు. దీనిలో 20 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ట్రంప్ దంపతులు అందరిని సాదర౦గా ఆహ్వానించారు. కాగా ఈ వేడుకలో వివిధ రకాల వేషధారణలు ఆకట్టుకోగా, పిల్లలందరికీ ట్రంప్ బహుమతులను పంచిపెట్టారు.