మరో ఫొటోతో వర్మ...

SMTV Desk 2017-10-31 16:54:39  rgv, lakshmis ntr, ram gopal varma, new movie updates

హైదరాబాద్, అక్టోబర్ 31: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. తాజాగా వర్మ ఎన్టీఆర్‌పై సినిమా తీయనున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. అప్పటినుండి నుంచి ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి నేతలు ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఆయనపై చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కీర్తి, ప్రతిష్టలకు భంగం కలుగకుండా ఈ చిత్రాన్ని రూపొందించాలని, లేని పక్షంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నాయకులు హెచ్చరిస్తుంటే, ఆయా వ్యాఖ్యలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతున్న వర్మ తాజాగా, తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘హరిణి తన అద్భుత అవగాహనతో, సృజనాత్మకతతో, అసాధారణ రీతిలో రూపొందించిన అల్ట్రా అల్టీమేట్ ఇమేజ్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.’ అంటూ, ఆనాడు చంద్రబాబునాయుడు, భువనేశ్వరి వివాహ వేడుకలో ఎన్టీఆర్ దంపతులు ఉన్న ఫొటోను ఉంచి .. దాని కింద ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్ తో ఫోటోను పోస్టు చేశారు. ఇటీవల ఎన్టీఆర్‌పై సినిమా తీస్తున్నందుకు ఆయన తనను అభినందిస్తున్నారంటూ ఓ ఫోటోను పోస్టు చేసిన విషయం తెలిసిందే.