భారీ వర్షానికి నలుగురు బలి..

SMTV Desk 2017-10-31 16:21:41  CHENNAI, TODAY WEATHER REPORT, BAY OF BENGAL.

చెన్నై, అక్టోబర్ 31 : బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి కారణంగా తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అతి భయంకరమైన గాలులు వీస్తూ భారీగా వర్షాలు కురుస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకం ఎదురు కాగా, పలు రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఈ వర్షాల కారణంగా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా ముంపు గ్రామాల్లో అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.