రేవంత్ ను సాదరంగా ఆహ్వానించిన రాహుల్..

SMTV Desk 2017-10-31 15:36:41  Congress vice president, Rahul gandhi, revanth reddy, seetakka

న్యూఢిల్లీ, అక్టోబర్ 31 : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సమక్షంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకోగా రాహుల్ సాదరంగా తన పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 18 మంది కాంగ్రెస్ లో చేరారు. వీరిలో సీతక్క, వేం నరేందర్ రెడ్డి, విజయ రమణారావు, అరికెల నర్సారెడ్డి, బోడ జనార్దన్, సోయం బాబురావు, జంగయ్య, బిల్యా నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా విజయరామారావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల అన౦తరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. సీతక్క మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చే విధంగా టీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని తెలంగాణలో టీడీపీ లేకుండా కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించారు.