టీడీపీకి మరో షాక్..

SMTV Desk 2017-10-31 10:50:17  Ex MLA Seethakka resign to TDP, revanth reddy, Chandrababu naidu, tdp sitakka

న్యూఢిల్లీ, అక్టోబర్ 31 : టీడీపీని వీడేది లేదంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రాజీనామా చేయడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ నుండి మరో వికెట్ పడిపోయింది. నేను పార్టీని వీడేది లేదంటూ చెబుతూ వచ్చిన వరంగల్ జిల్లా మహిళా నేత సీతక్క ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్ళిపోయింది. ఆమె తన రాజీనామాను చంద్రబాబుకు ఫ్యాక్స్ లో పంపించింది. ఈ క్రమంలో సీతక్క ఢిల్లీ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఏకీకరణ తప్పదన్నారు. కాగా నేడు రేవంత్ కాంగెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు.