పార్టీ సభలో ఏకాకిగా మిగిలిపోయిన కాంగ్రెస్ :మంత్రి హరీశ్‌రావు

SMTV Desk 2017-10-27 18:39:33  Assembly Affairs Minister Harish Rao, congress, NIN Akbaruddin

హైదరాబాద్, అక్టోబర్ 27 : అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని అధికార పక్షం మరోసారి స్పష్టం చేసింది. శాసనసభ సమావేశాల తొలి రోజు కాంగ్రెస్‌ పార్టీ సభలో ఏకాకిగా మిగిలిపోయిందని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ వ్యవహార శైలిని ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ తప్పుపట్టారని హరీశ్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ లేవనెత్తిన అన్ని అంశాలపైనా చర్చిద్దామని సీఎం నిన్ననే అన్నారని, అయినా కాంగ్రెస్‌ నేతలు అసహనంతో వ్యవహరించారన్నారు. తొలిరోజు పొడియం వద్దకు వచ్చినందున వేచిచూసే ధోరణి అవలంబించామని, ఇలాగే మళ్లీ ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.