పాక్ కేంద్రంగా చైనా సైనిక కార్యకలాపాలు

SMTV Desk 2017-06-09 10:28:59  china, pentagon, pakisthan, gwadara

వాషింగ్టన్, జూన్ 08 ‌: దాయాది దేశమైన చైనా సైనిక కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నది. మిత్రదేశమైన పాకిస్థాన్ లో సైనిక స్థావరం ఏర్పాటు చేయాలని చైనా ప్రయత్నిస్తోంది. ఆమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. అమెరికా చట్టసభ కాంగ్రెస్ కు బుధవారం సమర్పించిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వివరించింది. సైనిక బలాల విస్తరణలో భాగంగా పాక్ తో పాటు ఇతర మిత్రదేశాల్లోనూ స్థావరాలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. మిత్రదేశాలలో నౌకాశ్రయాలను నిర్మించి అదనపు స్థావరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆలోచిస్తోంది. పాక్ లోని బలూచిస్థాన్ లో గ్వాదర్ నౌకాశ్రయాన్ని అభివృద్ది చేయడం వెనుక మిలటరీ స్థావరం ఏర్పాటు చేయాలన్న ఉద్ద్యేశమే కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. సముద్ర దొంగలను అడ్డుకోవాలన్న కారణంతో హిందూ మహా సముద్రంలోకి జలాంతర్గాములను పంపిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. 2016 మేలో పాకిస్థాన్ లోని కరాచీ నౌకాశ్రయానికి అణ్వా యుధాలు ఉన్న జలాంతర్గామి వచ్చిన సంగతిని గుర్తు చేసింది. చైనా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాల్లో ప్రథమ స్థానం పాకిస్థాన్ దేనని తెలిపింది. పెంటగాన్ నివేదికను చైనా తప్పుపట్టింది. ఇది బాధ్యతారాహిత్య వ్యాఖ్య లని పేర్కొంది.