ఘూమార్.. సూపర్..

SMTV Desk 2017-10-25 19:34:06  deepika padukone, padmavathi SONG, sanjayleela bhansali, shahid kapoor, ranaveer singh

హైదరాబాద్, అక్టోబర్ 25: బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటిస్తున్న ‘పద్మావతి’ చిత్రంలోని తొలి పాట విడుదలైంది. ‘ఘూమార్ ఘూమార్... అంటూ సాగే పాటలో, రాణి పద్మావతి ఒంటి నిండా ఆభరణాలు ధరించి చేసే నాట్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రాజ్ పుత్ వంశస్థుల సాంప్రదాయ నృత్యంగా ఘూమార్ పేరొందింది. ఈ ఘూమార్ నృత్యాన్ని రాజస్థానీ రాణులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఆడపిల్ల పెళ్లి చేసుకొని అత్తవారి ట్లో అడుగుపెట్టినప్పుడు ఈ నృత్యం చేస్తారు. ఈ పాటను దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి కంపోజ్ చేయగా, శ్రేయ ఘోషల్ ఆలపించింది. కృతి మహేష్ నాట్యం నేర్పించారు. సినిమా చిత్రీకరణ ఈ పాట తోనే ప్రారంభం కావడం విశేషం. డిసెంబర్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.