బీసీసీఐ @ 850 కోట్లు..

SMTV Desk 2017-10-24 19:42:42  Indian Premier League, BCCI, BCCI president Shashank Manohar.

న్యూఢిల్లీ, అక్టోబర్ 24 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 లో నిషేధానికి గురైన కోచి టస్కర్స్ కు బీసీసీఐ తరపున రూ.850 కోట్ల పరిహారం దక్కనుంది. ప్రస్తుతం బీసీసీఐ, కోచికి తప్పకుండ పరిహారం చెల్లించాలని, న్యాయబద్దంగా అన్ని దారులు మూసుకుపోయి మరో అవకాశం లేదని సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడైన శశాంక్‌ మనోహర్‌ 2011లో కోచి టస్కర్‌ ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేశారు. అయితే ఈ ఒప్పందంపై కోచి బీసీసీఐకి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ కోర్టుకు వెళ్లింది. 2015లో కొచ్చికి నష్టపరిహారంగా రూ. 384.83 కోట్లతో పాటు ఈ మొత్తానికి 18 శాతం వడ్డీ చొప్పున నాలుగు సంవత్సరాలకు అయ్యే మొత్తాన్ని కలిపి చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది. అయితే బీసీసీఐ రెండు సంవత్సరాలుగా ఫ్రాంచైజీకు డబ్బులు కట్టకపోగా, ఐపీఎల్ లో కూడా ఆడించలేదు.