జీఎంఆర్ కు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్..గ్రీస్ ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగం

SMTV Desk 2017-06-09 10:20:13  gmr, gmr air ports, krithi, greece, hiraclia air port

హైదరాబాద్, జూన్ 08 ‌: జీఎంఆర్ సంస్థకు అంతర్జాతీయ ప్రతిష్ఠ సమకూరింది. మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్ కంపెనీ జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ గ్రీస్ దేశంలోని ప్రాజెక్టును దక్కించుకుని తన నిర్మాణ కౌశలాన్ని ప్రపంచానికి చాటింది. టెర్నా భాగస్వామ్యంతో గ్రీస్ లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును ఆ సంస్థ చేపట్టనుంది. ఈ మేరకు ఆసంయుక్త సంస్థకు కాంట్రాక్ట్ దక్కింది. నిర్మా ణం పూర్తయ్యాక ఎయిర్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్ చేపట్టనుంది. 35 ఏళ్లు కన్సేషన్ పీరియడ్ గా నిర్వహించాల్సి ఉంటుంది. హిరాక్లియో గ్రీస్ లో రెండో అతిపెద్ద విమానాశ్రయం. నాలుగేళ్లుగా విమాన ప్రయాణికుల సంఖ్య స్థిరంగా వృద్ధి చెందుతోంది. ఏటా 60 లక్షల మందికి పైగా ఆ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగి స్తుంటారు. రద్దీ దృష్య ఎయిర్ పోర్టును ఆధునికరించి అభివృద్ధి చేయాల్సి ఉంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అయిన గ్రీస్ కు ఏటా 2.4 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. క్రీతి అతిపెద్ద ద్వీపమే కాకుండా అత్యధిక పర్యటకులను ఆకర్షించే పర్యాటక ప్రాంతం. నూతనంగా నిర్మించే విమానాశ్రయం ద్వారా పర్యాటక రంగం మరింత అభిృవృద్ధి చెందుతుందని జీఎంఆర్ సంస్థ ఆశిస్తోంది.