మీరు అద్భుతమైన వ్యక్తులు :సాహో డైరెక్టర్

SMTV Desk 2017-10-24 19:08:03  PRABAS BIRTHDAY, SAHOO FIRST LOOK, SHRADDA KAPOOR, SUJEETH

హైదరాబాద్, అక్టోబర్ 24: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా సోమవారం ‘సాహో’ యూనిట్ సభ్యులు ప్రభాస్ చేత కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా దర్శకుడు సుజిత్ తన ట్విట్టర్ వేదికగా... డార్లింగ్ ప్రభాస్, నటి శ్రద్ధా కపూర్ లతో కలిసి దిగిన ఫోటో ను పోస్ట్ చేశారు. ‘మీరు అద్భుతమైన వ్యక్తులు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫోటో స్పెషల్ ఏంటంటే ప్రబాస్, శ్రద్ధా కలిసి దిగిన తొలి ఫోటో కావడంతో ఇంకా విశేషంగా మారింది. ఇప్పుడు ఈ జోడి ఫోటో సామాజిక మాధ్యమంలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బాహుబలి ప్రబాస్ జన్మదినం సందర్బంగా చిత్ర యూనిట్ ‘సాహో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్న ప్రబాస్ లుక్ అదిరి పోయింద౦ టు అటు అభిమానులు, ఇటు ప్రముఖులు సైతం ప్రశంసల జల్లు కురిపించారు.