వసతి గృహంలో కలుషిత ఆహరం.. అస్వస్థకు గురైన బాలికలు...

SMTV Desk 2017-10-24 10:51:27  Food poisoning, Jaggampeta hostel, 72 students injured.

తూర్పుగోదావరి, అక్టోబర్ 24 : కలుషిత ఆహారం తిని సుమారు 72 మంది బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో స్థానిక బాలికల వసతి గృహంలో చోటు చేసుకుంది. ఈ కలుషిత ఆహారం తిన్న బాలికలు వాంతులు చేసుకోగా, వారిని చికిత్స నిమిత్తం జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 16 మంది తీవ్ర అస్వస్థకు గురి కాగా వారిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వసతి గృహానికి చేరుకొని ఆహారాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో సిబ్బందిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.