ఆసీస్ జట్టుకి వార్నింగ్ ఇచ్చిన జాన్సన్..

SMTV Desk 2017-10-23 19:07:27   Aussies, England, match, Australian pacemaker, Mitchell Johnson

మెల్ బోర్న్, అక్టోబర్ 23 : త్వరలో జరుగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ అల్ రౌండర్ బెన్ స్టోక్స్ లేకుండా యాషెస్ సిరీస్ ను ఇంగ్లండ్ జట్టు గెలవలేదని ఇయాన్ చాపెల్, స్టీవ్ వా లాంటి ఆసీస్ దిగ్గజ క్రికెటర్ల వ్యాఖ్యలను మిచెల్ జాన్సన్ ఖండించారు. “స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ లేదు అనే వ్యాఖ్యలు అర్థరహితం. స్టోక్స్ లేకుండా ఇంగ్లండ్ యాషెస్ ను గెలవగలదు. నేను ఇంకా యాషెస్ ను ఆసీస్ గెలుస్తుందనే నమ్మకంతోనే ఉన్నా. కానీ మా జట్టు ప్రదర్శన ఇటీవల కాలంలో చెప్పుకోదగిన విధంగా లేదు. అలా అని ఇంగ్లండ్ కూడా అద్భుతమైన విజయాల్ని ఏమీ సాధించలేదు. ఈ పరిస్థితిలో రెండు జట్టుల మధ్య హోరాహోరి ఖాయం. స్టోక్స్ విషయాన్ని పక్కకు పెట్టి సిరీస్ గెలవడం గురించి ఆలోచించండి” అని జాన్సన్ తన టీంకు వార్నింగ్ ఇచ్చాడు.