నేను పార్టీ మారను : రేవంత్ రెడ్డి

SMTV Desk 2017-10-22 18:57:04  REVANTH REDDY PARTY CHANGE ISSUE

హైదరాబాద్, అక్టోబర్ 22 : టీడీపీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తానూ ఏ పార్టీ మారటం లేదని అవన్ని అబద్దపు వార్తలంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నేను ఏ పార్టీలో చేరట్లేదు, నా మీద వస్తున్న ఆరోపణలన్ని అవాస్తవాలు. మీడియాలో వార్తలను చూసి కార్యకర్తలు అపోహపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలను వివరిస్తా. రానున్న ఎన్నికల్లో కోడంగల్ నియోజక వర్గం నుండి పోటీ చేస్తా” అని అన్నారు.