సామాన్యుడి కూర్చీ కి ఎసరు ...ప్లాస్టిక్ కూర్చికి 28 శాతం బాదుడు

SMTV Desk 2017-06-09 10:01:00  plastic chair, gst on chair, 28 persent gst,

హైదరాబాద్, జూన్ 08 ‌: సామాన్యుడికి అత్యంత అందుబాటు ధరలో లభ్యమయ్యో ప్లాస్టిక్ కూర్చీలను లగ్జరీ వస్తువుల జాబితాలోకి చేర్చడం పై ప్లాస్టిక్ మౌల్డెట్ ఫర్నిచర్ తయారీ దారుల సంఘం తీవ్ర అభ్యం తరం వ్యక్తం చేసింది. జీ ఎస్ టీ కౌన్సిల్ ప్లాస్టిక్ కూర్చీలపై 28 శాతం పన్నురేటు నిర్ణయించిందని, వీటిని హౌస్ హోల్డ్ వస్తువుల జాబితాలోకి చేర్చడం ద్వారా 18 శాతం పన్ను స్లాబ్ లోకి తేవాలని ఆ సంఘం డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ కంపెనీలు 5 శాతం వ్యాట్, 12.5 శాతం ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాయి, దేశంలో 60 శాతం చిన్న స్థాయి కంపెనీలే ఉన్నాయి. ప్లాస్టీక్ కూర్చీలపై పన్ను 28 శాతం ముంటే పరిశ్రమలో ఈ తయారీ కంపెనీలు మనుగడ సాగించలేవని ఆ సంఘం అధ్యక్షులు రవీంద్రన్ వెల్లడించారు. పెద్ద బ్రాండ్లు ఎంత ధర పెట్టినా వినియోగదారులు కొంటారని, చిన్న కంపెనీలు స్వల్పంగా ధర సవరించినా కొనేవారుండరు రీ సైక్లింగ్ ప్లాస్టిక్ తయారీలో ఉన్న యూనిట్లకు ఇప్పటి వరకు పన్ను మినహాయిం పు ఉంది ఎస్ఎస్ఐ యూనిట్లకు ఎక్సైజ్ డ్యూటీ లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చాయని భారత పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు.