లంచగొండుల భరతం పడుతున్న భారతీయుడు

SMTV Desk 2017-06-08 17:08:04  ap, navanirmana dhiksha, vijaywada, benjecircle,1100,call center

అమరావతి, జూన్ 08 ‌: ఏపీ సంచలన కార్యచరణకు వేదికయింది. లంచం, అవినీతికి పాల్పడితే వారిని నామరూపాల్లేకుండా చేసే భారతీయుడు సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది..ఇప్పుడు ఏపీలో అటువంటి సీన్ రిపిట్ అవుతున్నది. కాల్ సెంటర్ 1100 పేరిట నిర్వహిస్తున్న లంచం పిర్యాదుల విభాగం చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. భారతీయుడి పాత్రను పోషిస్తు లంచం, అవినీతి నిర్మూలన లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది. దెబ్బకు లంచగొండులు తమ తీరు మార్చుకుంటున్నారు. తీసుకున్న లంచం తిరిగి ఇచ్చేందుకు లంచం ఇచ్చిన వారిని వేతికి పట్టుకుంటున్నారు. విజయవాడ కేంద్రంలో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలో లంచం కథలు కుప్పలు తెప్పలుగా వెల్లడవుతున్నాయి. ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురితో సభ వేదిక పై నుండి మాట్లాడించారు. లంచం ద్వారా పడిన ఇబ్బందులు, కాల్ సెంటర్ ద్వారా పరిష్కారమయిన తీరు చెబుతు అందరిలో ఉద్వేగాన్ని నింపుతు ఉత్సాహ పరుస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీరంగం ప్రసాద్ మాట్లాడుతు రేషన్ కార్డులో నా కుమార్తె పేరు చేర్పించేందుకు 2రూపాయల చొప్పున 500 రూపాయలు అప్పుచేసి మరీ రేషన్ దుకాణం డీలరుకు లంచంగా ఇచ్చా, ఎనమిది నెలలైనా అతను ఆ పనిచేసి పెట్టలేదు..అడిగితే పట్టించుకునేవాడు కాదు, మరో డీలర్ దగ్గరకు వెళితే ఆటో ఖర్చులు 50 రూపాయలు తీసుకోని పనిచేసి పెట్టాడని వెల్లడించారు. ఇదే విషయమై ఓ రోజు 1100కు ఫోన్ చేసి వివరాలు చెప్పానని.. ఆ డీలర్ తిరిగి వచ్చి తీసుకున్న లంచం తిరిగి ఇచ్చేశాడని వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన ఎరుక రెడ్డి మాట్లాడుతు ప్రతినెలా వచ్చే పింఛన్ నిలిచిపోయిందని అధికారులను అడిగితే 2 వేల రూపాయలు చెల్లించానని ..దాంతో పింఛన్ తిరిగి వచ్చిందని వెల్లడించారు. ఈ విషయమై కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేశా..వెంటనే లంచం తీసుకున్న అధికారి నా ఇంటికి వచ్చి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశాడని వెల్లడించారు. కృష్ణ జిల్లాకు చెందిన భూపతి శివశంకర్ మాట్లాడుతు రేషన్ కార్డులో నా భార్య పేరు తప్పుపడింది..సరి చేయమంటే వెయ్యి ఖర్చవుతుందని చెప్పారని..డబ్బు తీసుకుని ఎన్ని నెలలైనా సరిచేయలేదని.. ఈ విషయమై కాల్ సెంటర్ కు ఫిర్యాదు చేశా..అరగంట వ్యవధిలో నా దగ్గరకు వచ్చి తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇచ్చేశారని వెల్లడించారు. కాల్ సెంటర్ నిర్వహాణ తీరు ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తున్నది. సినిమాల్లో తప్ప నిజజీవితంలో ఉహించలేని విధంగా లంచం పై సమరం లా సాగుతున్న నవనిర్మాణ దీక్ష వైపు జనం ఆసక్తిగా తరలుతున్నారు. అవినీతి రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ది చేసుకోవాలనే తలంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.