కాలుష్య మరణాల్లో అగ్రస్థానం..

SMTV Desk 2017-10-20 19:56:11  polution in india, Lancet Journal Report.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20 : ప్రస్తుత౦ భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. అంతే వేగంగా ఇండియాలో వాయు, జల, వాతావరణ కాలుష్యాలు పతాకస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ కాలుష్యం ద్వారా ప్రజలను అనారోగ్యాలకు గురిచేయడమే కాకుండా వారి మరణాలకి కారణమవుతోందని లాన్సెట్‌ జర్నల్‌ నివేదిక ప్రకటించింది. సర్వే ముఖ్యాంశాలు: మృతుల సంఖ్య పెరగడానికి ప్రధానంగా గాలి, నీరు, నేల, రసాయన కాలుష్యాలే కారణమని సర్వే పేర్కొంది. 2015 లో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం వల్ల 7 లక్షల 38 వేల మంది మృతి చెందారు. ఇందులో అధికంగా భారత్ దేశం నుండి అత్యధికంగా 2 లక్షల 50 వేల మంది మరణించారు. అత్యంత వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతున్న భారత్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, మడగాస్కర్‌, కెన్యా వంటి దేశాల్లో కాలుష్య మరణాలు అధికంగా ఉంటున్నాయి.