సెహ్వాగ్ పుట్టిన రోజుకు సచిన్ ఫన్నీ ట్వీట్...

SMTV Desk 2017-10-20 17:10:18  Virender Sehwag, Sachin Tendulkar, SPORTS,

ముంబాయి, అక్టోబర్ 20: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటుంది. నేడు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు సందర్బంగా తన ట్విట్టర్ ఖాతా మొత్తం శుభాకాంక్షలతో వెల్లువెత్తింది. సెహ్వాగ్ ను పొగ‌డ్తల‌తో ముంచేస్తూ మీమేలు, ఫొటోలు, కవిత్వాలు, పంచ్‌ లైన్లు షేర్ చేశారు. అందులో భాగంగా మాస్టర్ సచిన్... ‘ హ్యాపీ బ‌ర్త్‌డే వీరూ... హావ్ గ్రేట్ స్టార్ట్ టు ద న్యూ ఇయర్‌.. మైదానంలో నేను చెప్పిన దానికి నువ్వు ఉల్టాగా (వ్యతిరేకంగా) చేసేవాడివి. అందుకే నీకోసం ఇలా! ‘ అంటూ అక్షరాలను తిరిగేసి రాసి ట్వీట్ చేశారు. దీనికి ఫన్నీ గా సెహ్వాగ్... ‘ థ్యాంక్యూ గాడ్ జీ (దేవుడా), పై వాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడని ఇప్పటి వరకూ విన్నాను. ఆయన కింద ఉన్న వాళ్లకు ఎలా రాస్తాడోన‌ని ఇవాళ అర్థమైందని’ రీ ట్వీట్ చేశారు.