కొత్త వ్యూహాల్లో కిమ్ జాంగ్ ఉన్..

SMTV Desk 2017-10-20 16:53:14  North koriya, Kim jang un, Australia, Wrote a letter to the Australian government.

ప్యాంగ్‌యాంగ్, అక్టోబర్ 20 : ఉత్తరకొరియా అధ్యక్షుడు కొత్త వ్యూహాన్ని రచించారా..! అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తన శత్రు దేశమైన అమెరికాను ఎదుర్కోవడానికి కిమ్ జాంగ్ ఉన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక తమ దేశమైనా ఉత్తరకొరియాకు ముప్పు పెరిగిందని ఈ దేశంపై ఎప్పుడైనా దాడి జరగవచ్చని ఆ లేఖలో పేర్కొన్నారు. అమెరికాను నియంత్రించి తమ దేశానికి అంతర్జాతీయ న్యాయం జరగాలని కిమ్ జాంగ్ కోరినట్లు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ తెలిపారు.