2020 అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనను : హిల్లరి

SMTV Desk 2017-10-20 16:39:21  America President Donald Trump, Hillary Clinton

అమెరికా, అక్టోబర్ 20: అమెరికాలో గతేడాది డోనాల్డ్ ట్రంప్ కు గట్టి పోటి ఇచ్చిన హిల్లరి క్లింటన్, 2020 నాటికి రానున్న అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనదట. హిల్లరి తన కొత్త పుస్తకం ‘వాట్ హ్యపెండ్’ ప్రచారంలో భాగంగా ఆమె బీబీసీ రేడియో 4 ‘విమెన్స్ అవర్‌’ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను అధ్యక్షత ఎన్నికలలో పాల్గొనను. కానీ రాజకీయాలలో మాత్రం క్రియాశీలకంగా ఉంటాను. పోటి చేయకునప్పటికీ నా గొంతుకు మద్ధతు పలికే వారున్నారని’ స్పష్టంగా వెల్లడించారు.