ప్రేమ నుండి ఉన్మాదం వైపు

SMTV Desk 2017-05-28 15:44:28  sabjar ahamad,hijbul mujahiddin,kashimir,

కాశ్మీర్, మే 26 : కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ లో ప్రాణాలు పోగొట్టుకున్న కరుడుగట్టిన ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ భట్ జీవితం ఆసక్తిని, ఆందోళనను కలిగిస్తోంది. బూర్హాన్ వాని బాల్య స్నేహితుడైన సబ్జార్ అహ్మద్ భట్, హిజ్బుల్ ముజాహిదిన్ అనుచరుడుగా చేరి, ముజాహిదిన్ కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహిస్తూ, కాశ్మీర్ లో విధ్వంసం సృష్టిస్తూ వచ్చిన సబ్జార్ జీవితంలో ఉగ్రవాది గా మారేందుకు బలమైన నేపథ్యం ఉంది. ఒక యువతితో గాఢమైన ప్రేమలో ఉన్న ఆయనకు ఆ యువతితో వివాహం జరిగే అవకాశం లేకపోవడంతో తీవ్రంగా మనస్థాపానికి గురై ఉన్మాదం, ఉగ్రవాదం వైపు అడుగులు వేయడం ప్రారంభించినట్లు వెల్లడయింది. బూర్హాన్ వానికి కుడిభుజంలా ఉండే సబ్జార్ ఆహ్మద్ క్రూరాతిక్రూరంగా వ్యవహరించే వాడని ఆయనను ఆ సంస్థ సభ్యులు సబ్ డాన్ అని కూడా పిలిచే వారని వెల్లడయింది. గత పక్షం రోజుల క్రితం ఆపరేషన్ చీఫ్ గా సైతం బాధ్యతలు తీసుకున్నట్లు, భద్రతా దళాలు ఆయనకు ఏ ప్లస్ ప్లస్ అనే క్యాటగిరి లో చేర్చారనే వివరాలు తెలిశాయి.