బంగారంపై మోజుతో తప్పుదారి

SMTV Desk 2017-05-27 13:59:34  gold,jewellars,ornaments,smagul,goldsmagling ,illigal transportation gold,gold at Airport,

హైదరాబాద్, మే 25 : బంగారంపై ఉండే మోజు తప్పుడుదారుల్ని ప్రోత్సహిస్తోంది. బంగారం, బంగారు అభరణాలు లేనిదే ఏ శుభకార్యం నిర్వహించని పరిస్థితి... వ్యక్తి శరీరం పై ధరించే బంగారం ద్వారా విలువలు, మర్యాదలు దక్కే పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. ముఖ్యంగా మహిళలకున్న మోజు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రస్తుతం మగవారు సైతం బంగారంపై ఆపేక్ష పెంచుకుంటున్న సందర్భాలు ఒక్కొక్కటిగా కన్పిస్తూనే ఉన్నాయి. బంగారం అమర్చిన షర్టుతో పూనా వ్యాపారి దేశంలోనే ప్రసిద్ది చెందినప్పటికి హత్యకు గురికావాల్సిన పరిస్థితిని చూసాము. బంగారానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రోజురోజుకు బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. అయితే దుబాయి తదితర దేశాల్లో బంగారం చౌకగా లభిస్తుండడంతో ఆయా దేశాల నుండి బంగారం తెచ్చుకోవడం రివాజుగా పరిణమించింది. ఆయా దేశాలకు ఉపాధి కోసమై వెళ్ళిన వారు తమ వెంట నిర్ద్యేశిత బంగారం తీసుకరావడం పరిపాటిగా మారింది. అయితే అక్రమంగా తరలించి రాత్రికిరాత్రే కిలోల కొద్ది బంగారంతో ప్రయోజనం పొందాలనుకునే వారి రూటే సఫరేటు. మర్మాంగాలలో, వివిధ వస్తువులలో బంగారం చొప్పించుకొని వస్తున్న వారికి తోడు ఏకంగా వ్యాక్యుమ్ క్లీనర్లో బంగారాన్ని రవాణా చేస్తుండగా గుట్టురట్టయింది. తమిళనాడు కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యాక్యూమ్ క్లినర్ లో బంగారం దాచేసి తరలించారు. ఆ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యు ఇంటలిజెన్స్ వారు అనుమానంతో తనిఖీ చేయగా 3.9 కిలోల బంగారం పట్టుబడింది, వెంటనే స్వాదీనం చేసుకోని కేసు విచారణ చేపట్టారు.