కోహ్లి గొప్ప బ్యాట్సమన్.. పాక్ బౌలర్ ప్రశంసలు..

SMTV Desk 2017-10-20 15:38:43  virat kohli, ameer khan, paak bowler mahammad amir

లాహోర్, అక్టోబర్ 20 : టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి గొప్ప బ్యాట్సమన్ అని పాక్ బౌలర్ మహమ్మద్‌ అమిర్‌ అన్నారు. కొన్ని రోజుల క్రితం ఒక టీవీ కార్యక్రమంలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌తో పాల్గొన్న కోహ్లీ ‘తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో అమిర్‌ ఒకడు’ అని చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా అమిర్‌ స్పందిస్తూ “కోహ్లి గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని ప్రపంచానికి తెలుసు. అలాంటి వ్యక్తికి బౌలింగ్ వేసేటప్పుడు ఎవరైనా అత్యుతమ ప్రదర్శన కనబరచాలి. అతనికి ఏ మాత్రం అవకాశం ఇచ్చిన మ్యాచ్ ను లాగేసుకుంటాడు. అందుకే కోహ్లికి బంతులు వేసేటప్పుడు నా అత్యుతమ ప్రదర్శన కనుబరుస్తా. అతను నా బౌలింగ్ ని పొగడడం నాకు ఆనందంగా ఉంది. కోల్‌కతా మ్యాచ్ లో తన బ్యాట్ ను నాకు కానుకగా ఇవ్వడం నేను ఎప్పటికీ మర్చిపోలేను” అని అమిర్‌ తెలిపాడు.