భారత్ విశ్వసనీయ భాగస్వామి : టిల్లర్సన్‌

SMTV Desk 2017-10-20 15:13:49   American Foreign Minister, Rex Tillarson, bharath Prime Minister Narendra Modi, US President, Donald Trump

వాషింగ్టన్‌, అక్టోబర్ 20 : శాంతిని కాంక్షించే ప్రజాస్వామ్య దేశాలన్ని౦టి మధ్య సంబంధాల బలోపేతానికి భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి "రెక్స్‌ టిల్లర్సన్‌" అన్నారు. విదేశాంగ మంత్రి హోదాలో టిల్లర్సన్ తొలిసారి భారత్ రానున్న నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పర్యటన సానుకూలంగా సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జరిపే పోరాటంలో భారత్‌తో కలిసి అమెరికా పనిచేస్తుందని తెలిపారు. ఓ వైపు భారత్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే మరో వైపు చైనాను విమర్శించారు. చైనాతో నిర్మాణాత్మక సంబంధాలనే అమెరికా కోరుకుంటోంది. కాని చైనా పోరుగు దేశాల సార్వభౌమాధికారాలను అణచివేస్తోంది. అది అమెరికా సహా మిత్ర దేశాలన్నిటికీ నష్టం కలిగిస్తుందని టిల్లర్సన్ వెల్లడించారు. ఈ సమయంలో భారత్ కు ఒక విశ్వసనీయ భాగస్వామి కావాంటూ ఆయన పేర్కొన్నారు.