కివీస్ కు స్లో ఓవర్ రేట్ జరిమానా

SMTV Desk 2017-06-08 11:14:57  newzealand, kiwiese, slow overrate, fined

కార్డిఫ్, జూన్ 8 : ఛాంపియన్స్ ట్రోఫిలో న్యూజిలాండ్ జట్టుకు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించిన నిర్వాహాకులు మరోసారి ఇదే నిబంధనను ఉల్లంఘిస్తే సారథి పై ఒక మ్యాచ్ నిషేధం అమలు చేస్తామని హెచ్చరించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ తప్పిదం న్యూజిలాండ్ ద్వారా జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ పై విజయం సాధించిన ఇంగ్లాండ్ టోర్నీలో సెమీఫైనల్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కి ఆహ్వానించింది. నిర్ణీత సమయంలో 50 ఓవర్లు పూర్తి చేయాల్సి ఉండగా..నిర్ణీత సమయంలో 48 ఓవర్లు మాత్రమే పూర్తి చేయగల్గారు. న్యూజిలాండ్ జట్టు రెండు ఓవర్లు ఆలస్యంగా వేసినట్లు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. దీంతో ఐసీసీ నిర్వాహకులు ఆ జట్టుకు జరిమానా విధించారు. నిబంధన ఉల్లంఘించినందుకు గాను న్యూజిలాండ్ జట్టు సారథి కేన్ విలియమ్సన్ కు మ్యాచ్ ఫీజులో 40 శాతం, మిగతా ఆటగాళ్ల ఫీజులో 20 శాతం కోత విధించినట్లు నిర్వాహకులు వెల్ల డించారు.