స్వగ్రామంలో రైతుగా స్థిరపడ్డాడు.....

SMTV Desk 2017-10-20 12:40:31  nowshid parammal, kerala NRI Quit His Job

కేరళ, అక్టోబర్ 20 : ప్రస్తుత రోజుల్లో విదేశాల మీద మోజుతో తమకున్న పంట పొలాలను సైతం అమ్ముకొని వలసపోతున్నారు. ఇలాంటి సమయంలో దుబాయ్ లో తనకున్న మంచి ఉద్యోగం, జీవితాలను వదిలిపెట్టి స్వదేశానికి వచ్చి రైతుగా స్థిరపడ్డాడు కేరళలోని కన్నూర్‌ జిల్లాకు చెందిన నౌషిద్‌ పరమల్‌. రైతుగా మారడమే కాకుండా కొబ్బరి ఆకులతో సంప్రదాయ బొమ్మలు తయారు చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేకాకుండా వివిధ రకాల బొమ్మల ఆకృతులను తయారి విధానంలో పిల్లలకు, పెద్దలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో నౌషిద్ మాట్లాడుతూ....”పరదేశంలో మంచి ఉద్యోగం కన్నా సొంత ఊరులో నచ్చిన పని చేసుకోవడంలోనే ఆనందంముంది” అంటున్నారు.