ఈ నెల 23 న మంత్రి వర్గ సమావేశం.

SMTV Desk 2017-10-20 11:51:38  telangana cm kcr, Ministerial Meeting, october 23 updates.

హైదరాబాద్, అక్టోబర్ 20 : తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 23 న జరగనుంది. శీతాకాల సమావేశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లుల విషయాలు, ప్రభుత్వం తరపున చేయాల్సిన తీర్మానాలను ఖరారు చేయనున్నారు. ఇదివరకు జారీ చేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లైన రహదారి, పీడీ, గేమింగ్, వ్యాట్, ఎక్సైజ్, పట్టాదారు పాసు పుస్తకాలు, దుకాణాలు-సముదాయాల వంటి సవరణకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.