ఊహించని విధంగా దాడులు నిర్వహిస్తాం : కిమ్ జాంగ్

SMTV Desk 2017-10-19 13:38:05  north koriya, amerika, maak drill, kim jang un.

ఉత్తరకొరియా, అక్టోబర్ 19 : తీవ్ర ఉద్రిక్తతల నడుమ అమెరికా నేవీ డ్రిల్స్ చేసి తమను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తెలిపారు. ఇలా ఏదో ఒక చర్యతో రెచ్చగొడుతున్న అమెరికాకు ఊహించని విధంగా షాక్ ఇస్తామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ఉత్తరకొరియా పట్ల మరీ ఉన్మాదంగా వ్యవహరిస్తుందని, ఇలాంటి చర్యలనే అమెరికా కొనసాగిస్తే ఆ దేశం ఊహించని విధంగా దాడులు జరుగుతాయని కిమ్ జాంగ్ ఉన్ తీవ్రంగా హెచ్చరించారు.