ముచ్చటగా మూడోసారి...

SMTV Desk 2017-10-18 17:48:15  kajal, raviteja, latest updates

హైదరాబాద్, అక్టోబర్ 18: ఈ ఏడాది ‘ఖైది నంబర్ 150’, ‘నేను రాజు మంత్రి’ సినిమాలతో మంచి హిట్ అందుకున్న కాజల్, మరొక కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఇటు తెలుగులో అటు తమిళంలో వరుస విజయాలతో దుసుకేళుతున్న అందాల తార కాజల్, మరోసారి మాస్ మహారాజా రవితేజతో జత కట్టనున్నట్లు సినీ వర్గాలలో టాక్. తమిళ చిత్రం ‘బోగన్’ కి రీమేక్ గా తెలుగులోకి తెరకెక్కుతున్న చిత్రంలో కాజల్ నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ‘వీర’, ‘సారోచ్చారు’ సినిమాలు ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఇంతకు ముందే రవితేజ-కాజల్ కలయిక ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ముచ్చటగా మూడోసారి ఈ జోడి తెరపై కనువిందు చేయబోతుంది.