ఏపీ సీఎంకు రామ్ గోపాల్ వర్మ కామెంట్స్..

SMTV Desk 2017-10-18 16:14:15  DIRECTOR RAM GOPAL VARMA,AP CM CHANDRABABU NAIDU, LAXMIS NTR MOVIE.

హైదరాబాద్, అక్టోబర్ 18 : లక్ష్మీ’స్ ఎన్టీఆర్ చిత్రంపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సినిమాపై చేసిన కామెంట్లకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. “లక్ష్మీ’స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అంటున్న చంద్రబాబు నాయుడు మాటలు ముమ్మాటికీ నిజం. అందుకని నేను ఏ మాత్రం వక్రీకరించకుండా, నిజంగా జరిగిన విషయాలను మాత్రమే తెరకెక్కించాలనుకుంటున్నా. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకమే.. కాని లక్ష్మీ’స్ ఎన్టీఆర్ లో నేను ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను తిరిగి అతికించబోతున్నాను”. అంటూ వెల్లడించారు.