తొమ్మిదేళ్ల చిన్నారి పై 145 కిలోల బరువు.....

SMTV Desk 2017-10-18 14:48:45  Florida, Nine child Derika Lindsay, Veronica, police

ఫ్లోరిడా, అక్టోబర్ 18 : పిల్లలు అన్నాక అల్లరి చేయడం సాధారణమే, తల్లిదండ్రులు కూడా వారిని అల్లరి చేయకూడదంటూ బెదిరియడం కూడా మాములే కానీ ఓ చిన్నారి క్రమశిక్షణలో పెట్టాలనుకుని ఏకంగా ఆ చిన్నారిని శిక్షిస్తే కుదురుగా ఉంటుందనుకుని ఆమెపై కూర్చోవడంతో చిన్నారి మృతి చెందిన ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన ఓ దంపతుల తొమ్మిదేళ్ల చిన్నారి డెరికా లిండ్సా బాగా అల్లరి చేస్తోందని, ఆమెను సరైన దారిలో పెట్టాలని ఆమె తల్లి గ్రేస్‌ స్మిత్, బంధు వైన వెరోనికా సాయం కోరింది. దీంతో లిండ్సాను శిక్షించాలని వెరోనికా భావించింది. చిన్నారి కూర్చొన్న కుర్చీలో ఆమెపై ఒక్కసారిగా కూర్చుంది. తనకంటే సుమారు ఐదు రెట్లు బరువున్న మహిళ కూర్చోవడంతో కాసేపటికే చిన్నారి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కూతురిని వెరోనికాయే చంపేసిందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వూపిరి ఆడటం లేదని చెప్పినప్పటికీ.. ఆమె చిన్నారి పైనుంచి లేవలేదని తండ్రి జేమ్స్‌ స్మిత్‌ తెలిపాడు. దాదాపు పది నిమిషాలకు పైగా భారీకాయంతో ఆమె చిన్నారిపై కూర్చోవడంతో చనిపోయిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యా నేరం కింద వెరోనికపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.